Magazines

కొలనుపాక చెరువులకు తపాస్పల్లి నీళ్లివ్వాలి

1 గంట క్రితం

tapaspalli water
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 05, 2026 | 1 నిమిషాల చదవడం

పిన్న చెరువు, అయ్యోరు చెరువు,కొచ్చెరువులను నింపాలని ఎంపీడీవోకు వినతి

నవతెలంగాణ-ఆలేర్ రూరల్

ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలోని పిన్న చెరువు,అయ్యోరు చెరువు,కొచ్చెరువులను తపాస్పల్లి ప్రాజెక్టు నీటితో నింపి రైతులు, గ్రామ ప్రజల నీటి కష్టాలను తీర్చాలని కోరుతూ ఎంపీడీవోకు వినతిపత్రం అందజేశారు.సర్పంచ్ బెదరబోయిన యాకమ్మ వెంకటేష్ ఆధ్వర్యంలో సోమవారం వినతిపత్రం సమర్పించారు.చెరువులను ప్రాజెక్టు నీటితో నింపితే ఆయకట్టు రైతులకు సాగునీటి భరోసా కలగడంతో పాటు భూగర్భ జలమట్టాలు పెరుగుతాయని వారు పేర్కొన్నారు. గ్రామంలోని వ్యవసాయ బోర్లు,తాగునీటి వనరులకు కూడా ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని తపాస్పల్లి ప్రాజెక్టు నుంచి చెరువులకు నీటిని విడుదల చేసేలా సంబంధిత అధికారులతో చర్యలు తీసుకోవాలని కోరారు.కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఆరుట్ల లక్ష్మీ ప్రసాద్ రెడ్డి,బైరీ కాలేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్