Magazines

ఈనెల 12న రైతునేస్తంలో సీఎం ప్రసంగం ప్రత్యక్ష‍్య ప్రసారం: ఏఓ రాజు

1 గంట క్రితం

avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 11, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-మద్నూర్ 

రేపు రైతు నేస్తం కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ప్రసంగం ప్రత్యక్ష‍్య ప్రసారం కానుందని మండల వ్యవసామ అధికారి రాజు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కార్యక్రమం ఉదయం 11:00 గంటల నుండి మద్నూర్,

పెద్ద ఎక్లారా, పెద్ద తడగూర్ గ్రామాల రైతులు రైతు వేదికలనకు రావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.


ఈ కార్యక్రమం ద్వారా ప్రస్తుత ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో రానున్న యాసంగి సీజన్‌కు పంటల ప్రణాళిక, పంటల వైవిధ్యీకరణ, అనువైన పంటల ఎంపిక, పంటల సాగు, యాజమాన్య పద్ధతులపై రైతులకు సీఎం అవగాహన కల్పిస్తారని పేర్కొన్నారు. మండలంలోని స్థానిక ప్రజాప్రతినిధులు, వ్యవసాయ  అనుబంధ శాఖల అధికారులు, రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నామనీ ముఖ్యమంత్రి అమూల్యమైన ప్రసంగాన్ని వీక్షించేందుకు తప్పకుండా హాజరై రైతు నేస్తం విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి ప్రసంగం రైతులకు దోహద పడతాయని తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్