నవతెలంగాణ-మద్నూర్
పండించిన పంటలకు మద్దతు ధర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భారీగా ప్రకటించినప్పటికీ ప్రభుత్వ ధరలకంటే ప్రైవేటు కొనుగోళ్లలో పంటల ధరల్లో భారీగా వ్యత్యాసాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుత ధరల కంటే ప్రైవేట్ పరంగా మరించగా ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయని చర్చలు వ్యక్తం అవుతున్నాయి. ప్రభుత్వ ధరలకు ప్రైవేటు ధరలకు భారీగా వ్యత్యాసాలు ఉన్నందున ఈ ఏడాది మద్దతు ధర సర్కార్ కాంటాలు కొనసాగేనా అనే చర్చలు వినబడుతున్నాయి. ఈ ఏడాది పంట దిగుబడులు అంతంత మాత్రంగానే ఉండటం సర్కార్ ధరల కంటే ప్రైవేట్ ధరలు అనుకూలంగా కనిపిస్తున్నాయి. సర్కార్ మద్దతు ధరలు ఈ విధంగా ఉన్నాయి. వరి ధాన్యం 2461 రూపాయలు, పత్తి మద్దతు ధర 8667, సోయా 5708, ప్రభుత్వం ప్రకటించింది.
ఇక ప్రస్తుతం ప్రైవేటు కొనుగోళ్ల ధరలు వరి ధాన్యం 3400 పలుకుతుంది. పత్తి ధర 9000 పలికింది. సోయా పంట 6600 పలుకుతుంది. ప్రస్తుతం కొనసాగే ప్రైవేటు ధరలు మరింతగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నట్లు చర్చలు వినబడుతున్నాయి. ఈ విధమైన సర్కార్ ధరలకు ప్రైవేటు ధరలకు భారీ వ్యత్యాసాలు కనిపించడం ఈ ఏడాది ప్రభుత్వ పరంగా కొనుగోలు జరిగే అవకాశాలు కనిపించడం లేదని చర్చలు వినబడుతున్నాయి. ప్రస్తుతం ప్రైవేట్ పరంగా పలుకుతున్న ధరలు ఇలాగే కొనసాగుతాయా లేక ధరలు తగ్గుముఖం పడతాయా మళ్లీ సర్కారు కాటలకే పని పెట్టవలసి వస్తుందా మున్ముందు వేచి చూడాలి.






కామెంట్‌లు (0)