Magazines

మద్నూర్‌ రైల్వే స్టేషన్‌ డిమాండ్‌పై కీలక పరిణామం

50 నిమిషాల క్రితం

Madnoor Railway Station
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 07, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలం-గాణ మద్నూర్

మద్నూర్‌ మండల ప్రజల చిరకాల రైల్వే స్టేషన్ డిమాండ్‌పై కీలక పరిణామం చోటుచేసుకుంది. మద్నూర్‌లో రైల్వే స్టేషన్ ఏర్పాటు చేయాలంటూ బండివార్ హనుమాన్లు చేసిన వినతికి స్పందించిన దక్షిణ మధ్య రైల్వే – హైదరాబాద్ డివిజన్ అధికారులు ఈ అంశంపై ఫీల్డ్ అసెస్‌మెంట్/సర్వే నిర్వహించినట్లు లేఖ ద్వారా తెలియజేశారు.


ప్రజా రవాణా అవసరాలు, మద్నూర్ ప్రాంత అభివృద్ధి, ప్రయాణికుల రద్దీ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని రైల్వే స్టేషన్ ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు అధికారిక లేఖలో పేర్కొన్నారు. మద్నూర్ ప్రాంతంలో రైల్వే స్టేషన్ ఏర్పాటుతో ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగుపడటంతో పాటు మద్నూర్ మండల అభివృద్ధికి, వాణిజ్య కార్యకలాపాలకు మరింత ఊతం లభిస్తుందని బండివార్ హనుమాన్లు తెలిపారు. మద్నూర్ ప్రజల రైల్వే స్టేషన్ కల సాకారం అయ్యే దిశగా ఇది ఒక ముఖ్యమైన ముందడుగు అని ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్