Magazines

ఢిల్లీలో ఉద్రిక్తత.. మరోసారి రాహుల్‌గాంధీ అరెస్ట్‌

59 నిమిషాల క్రితం

Rahul Gandhi
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 07, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలం-గాణ హైదరాబాద్‌: ఢిల్లీలో బుధవారం సాయంత్రం హై టెన్షన్ వాతావరణం నెలకొంది. జంతర్ మంతర్ వద్ద ధర్నాకోసం వెళ్తున్న రాహుల్ గాంధీని పోలీసులు అరెస్టు చేశారు. ఎస్ఐఆర్ ప్రక్రియ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా ఇండియా కూటమి ఎంపీలతో కలిసి లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ జంతర్ మంతర్ వద్ద ధర్నా కోసం వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. జంతర్ మంతర్ వద్ద నిరసనకు అనుమతి లేదని పోలీసులు రాహుల్ గాంధీని కూటమి ఎంపీలను అక్కడికి వెళ్లకుండా అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీకి మధ్య వాగ్వాదం జరిగింది. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారడంతో అక్కడ తోపులాట జరిగింది. అనంతరం రాహుల్ గాంధీని బలవంతంగా పోలీసులు వాహనం ఎక్కించి అక్కడి నుంచి తరలించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్