నవతెలంగాణ - భీంగల్
భీంగల్ మండల కేంద్రంలోని కారేపల్లి గ్రామ శివారులో గుర్తుతెలియని మన వ్యక్తి మృతదేహం లభ్యమైంది. పోలీసుల వివరాల ప్రకారం.. మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ (40 KL) సమీపంలో, బీటీ రోడ్డు పక్కన గుర్తు తెలియని మగవ్యక్తి మృతదేహం ఉన్నట్లు సమాచారం వచ్చిందనీ, వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించామని పేర్కొన్నారు. సుమారు 40 నుండి 50 సంవత్సరాల లోపు ఉన్న గుర్తు తెలియని పురుషుడి మృతదేహం అని చెప్పారు. ప్రస్తుతం మృతదేహం కుళ్లిపోయిందని చెప్పారు. మృతుడు నలుపు-తెలుపు డిజైన్ గల షర్ట్, బ్రౌన్ కలర్ 3/4 ప్యాంట్, తెలుపు రంగు బనియన్ మరియు ఆకుపచ్చ రంగు ఫుల్ డ్రాయర్ ధరించాడని తెలిపారు. పక్కనే మూడు బెడ్‌షీట్లు కూడా ఉన్నాయనీ, సుమారు 4 నుండి 5 రోజుల క్రితం మరణించి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. కారేపల్లి పంచాయతీ కార్యదర్శి మేడిపల్లి అజయ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని అన్నారు. మృతుడిని ఎవరైనా గుర్తించినట్లయితే భీంగల్ పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని పోలీసులు కోరారు.






కామెంట్‌లు (0)