నవతెలంగాణ-మద్నూర్
ఈనెల 13న గుండూర్ రోడ్డు జుక్కల్ లో నిర్వహించే బతకమ్మ సంబరాలకు తరలి వెళ్దామని మద్నూర్ గ్రామ సర్పంచ్ ఉషా సంతోష్ మేస్త్రి ఆదివారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. మధ్యాహ్నం మూడు గంటలకు జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మీకాంతరావు ప్రారంభిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమానికి గ్రామంలోని చిన్నారులు, మహిళలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈమేరకు ఎమ్మెల్యే బతుకమ్మ పండుగ నిర్వహణకు ప్రత్యే ఏర్పాట్లు చేశారని తెలిపారు.







కామెంట్‌లు (0)