నవతెలంగాణ - భీంగల్
భీంగల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఓ టీ హోటల్ వ్యక్తి నిప్పంటించుకున్న ఘటన సోమవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణానికి చెందిన పొలాస సుధాకర్ బస్టాండ్ సమీపంలో టీ వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే ఈమధ్య అర్ధరాత్రి సమయానికి మించి హోటల్‌ను నిర్వహిస్తున్నాడనే కారణంతో సుధాకర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో మనస్థాపానికి గురైన సదరు బాదితుడు పోలీస్‌స్టేషన్ ఆవరణలో ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఈ క్రమంలో ఆయనను చికిత్స నిమిత్తం హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.






కామెంట్‌లు (0)