Magazines

ప్రభాత్ పేరీకి ప్రత్యేకం శునక ప్రయాణం

20 నిమిషాల క్రితం

dog journey
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 24, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-మద్నూర్

గత 50 ఏండ్లుగా కొనసాగుతున్న కార్తీక మాసం ప్రభాత్ పేరి ఆలయాల సందర్శనాలకు ఈ ఏడాది భక్తుల ప్రయాణం నెల రోజులుగా కొనసాగుతోంది. వందలాది మంది భక్తులు జంగం మహేశ్వర్లు ఆధ్వర్యంలో చేపడుతున్న ఈ కార్యక్రమంలో ఆలయాల సందర్శనకు భక్తుల వెంట ఒక శునకం నెల రోజులుగా వెళ్లడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.


మంగళవారం కార్తిక పౌర్ణమి నాటికి ప్రభాత్ పేరి కార్యక్రమం నెలరోజులు పూర్తయింది. భక్తులు ఆలయాల్లో పూజలు చేస్తుంటే శునకం బయట కూర్చుని చూడడం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి లోనుచేసింది. నెలరోజుల ఈ కార్యక్రమం భారీ భక్తులతో విజయవంతం కావడం జంగం మహేశ్వరులు హర్షం వ్యక్తం చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్