Magazines

సహకార సేవలు విస్తరణ.!

9 నిమిషాల క్రితం

Expansion
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 24, 2026 | 1 నిమిషాల చదవడం

కాటారం డివిజన్ లో  కొత్తగా 4 పీఏసీఎస్ లు ఏర్పాటు శ్రీకారం.

నవతెలంగాణ-మల్హర్ రావు

రైతులను ఆర్థికంగా బలోపేతం చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల విస్తరణకు శ్రీకారం చుట్టింది.ఈక్రమంలోనే తాజాగా రాష్ట్రంలో కొత్తగా పీఏసీఎస్ ల ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.సహకార శాఖ సిఫార్స్ మేరకు ఇటీవల విడుదలైన కొత్త సహకార సంఘాల ఏర్పాటుకు ప్రభుత్వం ఉత్తర్వులు త్వరలోనే అందే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.

కొత్త సంఘాలివే..

కాటారం డివిజన్లో మొత్తం నాలుగు పిఏసిఎస్ లు ఏర్పాటు కానున్నాయి. మల్హర్ రావు మండలం నుంచి కొయ్యుర్, మహాదేవపూర్ నుంచి పలిమేల,మహముత్తారం నుంచి బోర్లగూడెం,కాటారం నుంచి దామేరకుంట గ్రామాల్లో కొత్త పీఎసీఎస్ లు ఏర్పాటు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.ఈ సందర్భంగా కొత్తగా సహకార సంఘాలు ఏర్పాటు చేయడంపై ఆయా సంఘాల పరిధిలోని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

నాయకులకు పదవుల పండుగ...

నూతన సొసైటీలు ఏర్పాటుతో రైతులతోపాటు స్థానిక నాయకులకు వరంగా మారనుంది.గత గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఓడిపోయిన వారు,ఎంపిటిసి,జెడ్పిటిసి పదవుల కోసం ఎదురుచూస్తున్న నాయకులకు పిఏసిఎస్ లో డైరెక్టర్ల పదవులు దక్కనున్నాయి.ఒక్కొక్క సొసైటీ నుంచి 13 మంది డైరెక్టర్లను ఎన్నుకోవాల్సి ఉండగా వారిలో నుంచే చైర్మన్,వైస్ చైర్మన్ ను ఎన్నుకొంటారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్