Magazines

అలరించిన 'స్వనిక'వనభోజనాలు..ఆకట్టుకున్న పుస్తకావిష్కరణలు

45 నిమిషాల క్రితం

Svanika picnic

'మనో మథనం' పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న ప్రముఖ కవి, సినీ గీత రచయిత మౌనశ్రీ మల్లిక్ .

వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 24, 2026 | 1 నిమిషాల చదవడం


నవతెలంగాణ కీసర: కీసరలోని దివ్య రిట్రీట్‌లో 'స్వనిక'ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తీక మాసపు వనభోజనాల కార్యక్రమం ఆద్యంతం ఉత్సాహభరితంగా, ఆహ్లాదకరంగా సాగింది.ఈ వేడుకల్లో భాగంగా నిర్వహించిన సాహిత్య,సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను విశేషంగా అలరించాయి. కార్యక్రమంలో విజయలక్ష్మి వెంకట్ రచించిన'మనో మథనం'పుస్తకాన్ని ప్రముఖ కవి,సినీ గీత రచయిత మౌనశ్రీ మల్లిక్ ఆవిష్కరించారు.అనంతరం విజయలక్ష్మి కొలపర్తి రచించిన'అమ్మకానికో అమ్మ'పుస్తకాన్ని స్వనిక గ్రూప్ సభ్యులు స్వప్న, నిర్మల, కవిత ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆవిష్కర్త మౌనశ్రీ మల్లిక్ మాట్లాడుతూ..విజయలక్ష్మి వెంకట్ రచనా సంవిధానం అద్భుతంగా ఉందని ప్రశంసించారు.ఇలాంటి ఉత్తమ రచనలు మరిన్ని రావడం వల్ల సాహిత్య రంగం సుభిక్షంగా ఉంటుందని రచయిత్రి ప్రతిభను కొనియాడారు.అలాగే,విజయలక్ష్మి కొలపర్తి రచించిన 'అమ్మకానికో అమ్మ'పుస్తకం సమాజానికి ఒక మేలుకొలుపు వంటిదని వక్తలు అభిప్రాయపడ్డారు.వనభోజనాల వల్ల మానసిక ఉల్లాసం కలుగుతుందని,వేర్వేరు ప్రాంతాల్లో పుట్టి పెరిగిన వారంతా ఒకే చోట చేరి కుటుంబ సభ్యుల్లా మెలగడం వల్ల ఒత్తిడి దూరమవుతుందని పేర్కొన్నారు.మెరుగైన సమాజ నిర్మాణానికి ఇటువంటి మానవ సంబంధాల కలయిక ఎంతో అవసరమని వక్తలు ఆకాంక్షించారు.

ఈ వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన సంగీత విభావరిలో హరీష్ కుమార్ శర్మ,ఉత్కర్ష,మామిడి అమరేందర్,రవి ప్రసాద్ సాండేసరి ఆలపించిన పాటలు అందరినీ మంత్రముగ్ధులను చేశాయి.ఈ కార్యక్రమంలో 'రవళి'పత్రిక అధినేత రామ శర్మ,ముక్కెర సంపత్ కుమార్,శరత్ సుదర్శి,నూకల అశోక్,కామేష్ భద్రి,ముచ్చర్ల రజని,శకుంతల,వాసుదేవరావు,సంజయ్,అనురుద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్