Magazines

వరి కొయ్యలకు నిప్పు..భూసారానికి ముప్పు

11 నిమిషాల క్రితం

rice fields
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 24, 2026 | 2 నిమిషాల చదవడం

గడ్డిని కలియదున్నితేనే అధిక ప్రయోజనాలు

రైతులకు అవగాహన కల్పిస్తున్న వ్యవసాయాధికారులు

నవతెలంగాణ-మల్హర్ రావు

రైతులు యాసంగి సాగు సన్నద్ధమవుతున్నారు.అందులో భాగంగా వరికో యగా,మిగిలిన వరి కొయ్యలను లేకుండా చేసేందుకు నిప్పు పెడుతున్నారు.రైతుకు తెలియకుండానే వరికొయ్యలు కాల్చడంతో వాతావరణానికి ఎన్నో అనర్థాలు జరగడమేకాక,తనను తాను నష్టపరుచుకుంటున్నారు.వరికొయ్యలు కాల్చకుండా నేలలోనే కలియదున్నడంతో సేంద్రియకర్బన శాతం పెరిగి,రసాయన ఎరువుల వినియోగం తగ్గుతుంది.తద్వారా నేల మరింత సారవంతమై దిగుబడి పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.


కలియదున్నడం వల్ల కలిగే లాభాలు..

నేలసారవంతమవడంతో పాటు, దిగుబడులు పేరిగే అవకాశాలున్నాయి.దుక్కిదున్నే సమయంలో సింగిల్ సూపర్ పాస్పేట్ చల్లితే, నేలలో ఉన్న అవశేషాలు రెండు వారాల్లో మురిగి పోషకాలుగా అందుబాటులోకి వస్తాయి.దాంతో డీఏపీ వాడకం 50 శాతం తగ్గుతుంది.కొయ్యకాళ్లను మురగబెట్టి కలియ దున్నడం వల్ల, 60 శాతం వరకు ఎరువుల వినియోగం తగ్గుతుంది. సేంద్రియ కర్బనశాతం పెరిగి,5 శాతం సాధించవచ్చు.మొక్కలకు 2శాతం నత్రజని,4 శాతం పాస్పరస్ అదనంగా అందిస్తోంది.జింక్,మంగనీస్,ఐరన్,కాల్షియం లాంటి సూక్ష్మదాతలు నెలలో ఉండడంతో పంట సాగుకు కావాల్సిన పోషకాలు అందుతాయి.


కాల్చడం వల్ల జరిగే నష్టాలు..

తరుచూ వరికొయ్యలు కాల్చడంతో, అధిక వేడితో భూమి సారాన్ని కోల్పోతుంది.నేలలో ఉన్న నత్రజని, పాస్పరస్ వంటి పోషక పదార్థాల శాతం తగ్గుతుంది.వాతావరణం కాలుష్యం మార్పులు వస్తాయి. భూమిలో ఉండే పీచు పదార్థాల అవశేషాలు పూర్తిగా కాలిపోవడంతో పాటు, పంటకు అవసరమైన ఖనిజ లవణాలు దెబ్బతింటాయి.నేలకు మేలు చేసే సూక్ష్మజీవులు, ముఖ్యంగా వాన పాములు, పంటలకు మేలు చేసే రకర కాల జీవులు చనిపోతాయి. ప్రకృతి సమ తుల్యత దెబ్బతింటుంది.విపరీతమైన పొగ వ్యాపించడంతో రైతులు ఆనా రోగ్యాలకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి.


కల్పిస్తున్నాం...సంజయ్ కుమార్..వ్యవసాధికారి

ఎల్ నినో నేపథ్యంలో నీటి వినియోగం తక్కువగా ఉండే పంటలు సాగు చెయ్యాలి. వరి కోతలు పూర్తయ్యాక మిగిలిన కొయ్యలను కాల్చవద్దు.ఈ మేరకు రైతులకు అవగాహన కల్పిస్తున్నాం.కొంతమంది రైతులు తమ సూచనలను పట్టించుకోకుండా వరికొయ్యలకు నిప్పు పెడుతున్నారు.ఇది ప్రకృతికి, భూమికి తీరని నష్టం.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్