Magazines

సలాబత్పూర్‌ ఆలయంలో కార్తీకపౌర్ణమి శోభ

33 నిమిషాల క్రితం

Karthikamasam
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 24, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-మద్నూర్

కార్తీకమాసం సందర్భంగా మంగళవారం ప్రఖ్యాత సలాబత్పూర్‌ ఆంజనేయ స్వామి ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. ఈ మేరకు నేడు ఓకేసారి 250 మంది దంపతులు సత్యనారాయణ వ్రతంలో కూర్చున్నారు. వీరితో పాటు ఆలయానికి శివ భక్తులు భారీ సంఖ్యలో చేరుకుని తమ మొక్కులను చెల్లించుకున్నారు. ఈ క్రమంలో భక్తుల సౌకర్యార్థం ముందుగానే నిర్వాహకులు అన్ని ఏర్పాట్లను చేశారు.


శ్రీ ఏకతా గ్రూప్ ట్రావెల్స్ హైదరాబాద్‌ వారు భక్తులకు భారీ అన్నదానం నిర్వహించారు. ఆలయానికి ఇటు తెలంగాణ అటు మహారాష్ట్ర కర్ణాటక ఈ మూడు రాష్ట్రాల భక్తులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. ఈ కార్యక్రమాలకు ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాములు, అధికారి వేణు, కల్పన, ఆలయ పూజారులు, ఇతర సిబ్బంది పర్యవేక్షణలో కార్తీకమాసం సత్యనారాయణ వ్రత పూజలు విజయవంతం చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్