నవతెలంగాణ - మల్హర్ రావు
తెలంగాణ గ్రామపంచాయతీల్లో విధులు నిర్వహిస్తున్న కారోబార్లు, బిల్ కలెక్టర్లు, ఇతర గ్రామపంచాయతీ సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలు, పెండింగ్ డిమాండ్లు, హక్కుల పరిరక్షణ, ఉద్యోగ భద్రత అంశాలపై పోరాటం చేస్తామని ఐ.ఎన్.టి.యుసి రాష్ట్ర ఉపాధ్యక్షుడు మొగిల్లా రాజిరెడ్డి అన్నారు. మంగళవారం ఐఎన్టియుసి ప్రధాన కార్యదర్శి ఎరగాని నాగయ్య గౌడ్, తెలంగాణ గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ యునైటెడ్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు సాదుల శ్రీకాంత్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కలిసి సమస్యల పరిష్కారానికి సంబంధించిన అంశాలను వివరంగా చర్చించడం జరిగిందని తెలిపారు.
ఈ సందర్భంగా ఐఎన్టియుసి ముఖ్య నాయకులు స్పందిస్తూ.. గ్రామపంచాయతీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఎల్లప్పుడూ ముందుంటామన్నారు. ఉద్యోగుల న్యాయపరమైన డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, సంబంధిత ప్రభుత్వ పెద్దలతో చర్చించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. గ్రామపంచాయతీ ఉద్యోగుల హక్కుల సాధనలో, వారి సంక్షేమం కోసం ఐఎన్టియుసి అండగా నిలిచి పోరాటం చేస్తుందని భరోసా కల్పించారు.
మా సమస్యల పరిష్కారానికి ముందుకు వచ్చి భరోసా ఇచ్చిన ఐఎన్టియుసి ముఖ్య నాయకులకు తెలంగాణ గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ యునైటెడ్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గం తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దొంతుల సత్యం, తోలుకునూరి అశోక్, మేదరి రాజేందర్, నాగనబోయిన శ్రీనివాస్, గౌడ రాజమహేందర్, నాగరాజు, కుమార్ పాల్గొన్నారు.






కామెంట్లు (0)