నవతెలంగాణ – హైదరాబాద్: నగరంలోని రవీంద్ర భారతి కాన్ఫరెన్స్ హాల్‌లో ఈనెల 22న ఆదివారం అంబటి వెంకన్న సాహిత్య సమాలోచన సదస్సు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ‘అంబటి @30.. అంబటి వెంకన్న సాహితీ యానం’ పుస్తకాన్ని ఆవిష్కరించనున్నారు. తెలంగాణ సాహిత్య అకాడమీ సౌజన్యంతో ఉనికి సామాజిక సాంస్కృతిక వేదిక, జాబిలి కళామండలి సంయుక్తంగా రోజంతా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నాయి. ఈ సదస్సులో డాక్టర్ బి. నర్సింగరావు, గోరటి వెంకన్న, విమలక్క, అంబటి సురేందర్ రాజు, డాక్టర్ సుంకిరెడ్డి నారాయణరెడ్డి, వేదకుమార్, ఏనుగు నరసింహారెడ్డి, నామోజు బాలచారి, ఏపూరి సోమన్న, కే. శ్రీనివాస్, జి. లక్ష్మీ నరసయ్య, జూలూరి గౌరీశంకర్, పాశం యాదగిరి, డాక్టర్ పిల్లలమర్రి రాములు, నాలేశ్వరం శంకరం, డాక్టర్ సంగిశెట్టి శ్రీనివాస్, డాక్టర్ కదిరి కృష్ణ, డాక్టర్ పసునూరి రవీందర్, వనపట్ల సుబ్బయ్య తదితరులు పాల్గొననున్నారు.






కామెంట్‌లు (0)