నవతెలంగాణ-ఆలేరు టౌన్
తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీల అమలులో కాలయాపన చేస్తే మరో ఉద్యమం తప్పదని తెలంగాణ ఉద్యమకారుల మండల కో కన్వీనర్, కోశాధికారిలు ఇక్కిరి శ్రీనివాస్, జంపాల శ్రీనివాస్ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆలేరు పట్టణ కేంద్రంలోని క్రాంతి నగర్ లో మంగళవారం ఇక్కిరి శ్రీనివాస్, జంపాల శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏర్పడి మూడేండ్లు గడుస్తున్నా తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను అమలుచేయకపోవడం శోచనీయమన్నారు. ఉద్యమకారులను ప్రభుత్వం తక్కువ చూస్తే మరో ఉద్యమానికి సన్నద్ధం అవుతామని హెచ్చరించారు. అమర వీరుల త్యాగం, ఉద్యమకారుల ధైర్య సాహసాలు, వీరోచిత పోరాటాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం అవతరించిందని ప్రభుత్వానికి గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మలిదశ తెలంగాణ ఉద్యమ నాయకులు ఎర్ర జాన్సన్, మొరిగాడి, అశోక్, చెక్క వెంకటేష్, బడుగు జాంగిర్, జింకల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.






కామెంట్‌లు (0)