నవతెలంగాణ-మర్రిగూడ
ఎల్ నినో ప్రభావం,జల సంరక్షణ ప్రాముఖ్యతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పాఠశాల విద్యాశాఖ ఆదేశాల మేరకు గురువారం మండలంలోని దామెర భీమనపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయ బృందం,విద్యార్థుల ఆధ్వర్యంలో గ్రామంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉదావత్ లచ్చిరాం విద్యార్థులతో జల సంరక్షణ ప్రతిజ్ఞ చేయించారు.
అనంతరం గ్రామంలో ర్యాలీ నిర్వహించి ప్రజలకు నీటి పొదుపు,పర్యావరణ పరిరక్షణ పై అవగాహన కల్పించారు.వర్షపు నీటిని వృధా చేయకుండా ఒడిసిపట్టాలని,భూగర్భ జలాల సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని,నీరు ప్రకృతి ప్రసాదించిన అమూల్యమైన సంపద అని,భవిష్యత్ తరాలకు నీటి కొరత లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ప్రజలకు క్షుణ్ణంగా వివరించారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కొండ శ్రీనివాస్, మీనా,అమీనా,జిల్లా కృష్ణయ్య, అంభాల రమేష్,వనమాల మహేష్,రాజు,బాలాజీ,జహంగీర్ తదితరులు పాల్గొన్నారు.






కామెంట్‌లు (0)