Magazines

అయ్యవారిపల్లి ఆపద్బాంధవుడు పండుగ ప్రదీప్ రెడ్డి 

2 గంటల క్రితం

Pradeep Reddy
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 01, 2026 | 2 నిమిషాల చదవడం

పేదలు ఆపదలో ఉంటే అండగా నిలబడుతా 
ప్రజలు ఆశీర్వదిస్తే స్థానిక ఎన్నికల్లో మిడ్జిల్ జెడ్పిటిసిగా పోటీచేస్తా

నవతెలంగాణ-మిడ్జిల్

సమాజంలో మానవత్వపు విలువలు మాయమవుతున్న ఈ రోజుల్లో తోటివారి కష్టాన్ని తన కష్టంగా భావించి అండగా నిలిచే గుణం కొందరిలోనే కనిపిస్తుంది. అలాంటి అరుదైన సేవా గుణంతో, మిడ్జిల్ మండలం అయ్యవారిపల్లి గ్రామవాసి పండుగ ప్రదీప్ రెడ్డి స్థానిక ప్రజల గుండెల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. నిత్యం గ్రామస్థుల కష్టసుఖాలను ప్రతిక్షణం పట్టించుకుంటూ, ఆపదలో ఉన్నవారికి తక్షణ సాయం అందిస్తూ ఆయన అయ్యవారిపల్లి ఆపద్బాంధవుడుగా పేరొందారు.


గ్రామంలో పేద కుటుంబాల ఆడపిల్లల పెళ్లిళ్లకు ఆర్థిక భారం కాకుండా తనవంతుగా సాయం అందించడం, కుటుంబంలో ఎవరైనా చనిపోతే ఆ చావులకు వెళ్ళి బాధిత కుటుంబాలను ఓదారుస్తూ అంత్యక్రియలకు సైతం తక్షణ ఆర్థిక సాయం చేయడం ప్రదీప్ రెడ్డి నిరంతర దినచర్యగా మారింది. అంతేకాకుండా, నిరుపేదలు అనారోగ్యం బారిన పడి ఆసుపత్రిలో ఆపదలో ఉన్నప్పుడు, వైద్య ఖర్చుల నిమిత్తం వెనుకాడకుండా ఆర్థిక చేయూతనిస్తూ ఎందరో ప్రాణాలను నిలబెట్టడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.


రాజకీయ ప్రయోజనాలకు అతీతంగా, కేవలం సామాజిక బాధ్యతతో స్పందిస్తూ, గ్రామంలో ఏ ఇంట ఏ కష్టం వచ్చినా "నేనున్నాను" అంటూ ముందుండే పండుగ ప్రదీప్ రెడ్డి సేవా నిరతిని అయ్యవారిపల్లి గ్రామస్థులతో పాటు చుట్టుపక్కల ప్రజలు కూడా ప్రశంసిస్తున్నారు. కష్ట కాలంలో దేవుడిలా ఆదుకుంటున్న ప్రదీప్ రెడ్డి మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, ఆయన సేవా ప్రస్థానం ఇలాగే సాగాలని గ్రామస్తులు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. 10 సంవత్సరాల క్రితమే గ్రామంలో రెండు లక్షల రూపాయలతోటి బస్ షెల్టరు ఏర్పాటుచేసి నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్ల రవితో ప్రారంభించినట్లు తెలిపారు.


అయ్యవారిపల్లి ప్రభుత్వ పాఠశాలకు వచ్చే చిల్వేరు గ్రామ విద్యార్థులకు సొంత డబ్బులతో ఆటోను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. చెన్నకేశవ స్వామి టెంపుల్ కు రథోత్సవం ఏర్పాటు చేశారు. విద్యార్థులకు పై చదువులకు చేయుతనిస్తూ, ఆపదలో ఉన్న స్నేహితులకు అండగా అండగా ఉంటున్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మండల ప్రజలు, యువకులు, మహిళలు ఆశీర్వదిస్తే స్థానిక ఎన్నికలలో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సహకారంతో మిడ్జిల్ జెడ్పిటిసిగా బరిలో ఉంటానని పేర్కొన్నారు.


నవతెలంగాణ: దేశంలో నీకు నచ్చిన నాయకుడు 
ప్రదీప్ రెడ్డి: రాహుల్ గాంధీ, రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 

నవతెలంగాణ: నచ్చిన రంగు తెలుపు, నాన్ వెజ్ చాలా ఇష్టం 

హీరో జూనియర్ ఎన్టీఆర్, సూర్య

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్