Magazines

సభలను జయప్రదం చేయాలని బైక్ ర్యాలీ 

1 గంట క్రితం

CPIM
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 09, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-మర్రిగూడ 

జిల్లా కేంద్రంలో ఈనెల 15 నుండి 18 వరకు జరిగే అఖిలభారత 36వ రైతు మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ సోమవారం మండల కేంద్రంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి ఏర్పుల యాదయ్య ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు బైక్ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కార్యదర్శి ఏర్పుల యాదయ్య మాట్లాడుతూ.. దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను వ్యతిరేకించాలని, రైతులకు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని, రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్, పత్తి రైతులకు పంట నష్టం, రైతుల బ్యాంకు రుణాలు మాఫీ చేసి, కొత్త రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.


సభలకు రైతులు, కార్మికులు, కర్షకులు, మహిళలు, ఉద్యోగులు, మేధావులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చేతివృత్తుదారుల సంఘం జిల్లా నాయకులు సల్పోజ్ రామలింగాచారి, దామెర లక్ష్మి, జిపి వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్షులు, రామావత్ రాజు నాయక్, మిషన్ భగీరథ వర్కర్స్ యూనియన్ నియోజకవర్గస్థాయి నాయకులు గ్యార కాశయ్య, కొమ్ము వెంకటయ్య, మాడుగుల శ్రీను, ఊరు పక్క లింగయ్య, భూతరాజు వెంకటయ్య, మైలారం నరసింహ, సిల్వర్ మహేష్, చాపల రవి, ఒట్టిపెల్లి సాయికుమార్, చెక్క పెంటయ్య, పోతరాజు కృష్ణయ్య, ఊరి పక్క అరవింద్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్