Magazines

సత్తుపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్‌గా 'చల్లగుళ్ల నరసింహారావు' 

09 నవంబర్, 2026

Market Committee
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 09, 2026 | 2 నిమిషాల చదవడం

- వైస్ చైర్మన్‌గా వంట్ల కృష్ణార్జునరావు

- రెండేళ్ల పాటు నూతన కమిటీ పదవీకాలం కొనసాగింపు

- అధికారికంగా ప్రకటించిన ఎమ్మెల్యే 

- రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేయాలి: ఎమ్మెల్యే రాగమయి దయానంద్ 

నవతెలంగాణ-సత్తుపల్లి 

​సత్తుపల్లి మార్కెట్ కమిటీ (ఏఎంసీ) నూతన చైర్మన్‌గా సత్తుపల్లి పట్టణానికి చెందిన చల్లగుళ్ల నరసింహారావు నియమితులయ్యారు. ఈ మేరకు సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ సోమవారం స్థానిక ద్వారకాపురిలోని అధికారిక క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నూతన చైర్మన్ పేరును అధికారికంగా ప్రకటించారు.

​ఈ కమిటీలో చైర్మన్‌తో పాటు వైస్ చైర్మన్‌గా వేంసూర్ మండలం భీమవరం గ్రామానికి చెందిన వంట్ల  కృష్ణార్జునరావును ఎంపిక చేశారు. వీరితో పాటు మార్కెట్ కమిటీ కార్యవర్గంలో మరో 16 మందిని డైరెక్టర్లుగా నియమిస్తూ ఎమ్మెల్యే రాగమయి దయానంద్ జాబితాను విడుదల చేశారు. నూతనంగా ఏర్పడిన ఈ పాలకవర్గం నవంబర్ 4వ తేదీ నుంచి బాధ్యతలు స్వీకరించినట్లు పరిగణలోకి తీసుకున్నారు. ఈ కమిటీ రెండేళ్ల పాటు అంటే 2026, నవంబర్ వరకు కొనసాగుతుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

​సత్తుపల్లి మార్కెట్ కమిటీ నూతన కార్యవర్గ బాధ్యులు వీరే

సత్తుపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్‌గా

​చల్లగుళ్ల నరసింహారావు (సత్తుపల్లి)

​వైస్ చైర్మన్‌గా వంట్ల  కృష్ణార్జునరావు (భీమవరం)

​డైరెక్టర్లుగా మందపాటి రాజేంద్ర ప్రసాదరెడ్డి (సదాశివునిపాలెం), పొన్నగంటి జోగారావు (కిష్టాపురం), దాసరి వెంకటేశ్వరరెడ్డి (సత్తుపల్లి), మొండ్రు సుందరరావు (రేజర్ల), కొప్పుల శ్రీను (బేతుపల్లి), కొర్సా సత్యవతి (రుద్రాక్షపల్లి), గుండు ప్రసాద్ (సత్తుపల్లి), నడిపల్లి శ్రీనివాసరావు (సత్తుపల్లి), ముచ్చనపల్లి నరసింహారావు (మర్లపాడు), ఒగ్గు కరుణాకరరెడ్డి (అడసర్లపాడు), మొహమ్మద్ ఇబ్రహీం (వేంసూరు), చిల్లపల్లి లక్ష్మీ శ్రావణి (కందుకూరు), మొహమ్మద్ రెహానా కమల్ (మున్సిపల్ చైర్ పర్సన్, సత్తుపల్లి), పీఏసీఎస్ చైర్మన్ (సత్తుపల్లి), జిల్లా మార్కెటింగ్ ఆఫీసర్,  సత్తుపల్లి ఏడీఏ కొత్త కార్యవర్గంలో డైరెక్టర్లుగా వ్యవహరిస్తారు. 


​రైతు సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలి: సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ రాగమయి దయానంద్

​కొత్తగా బాధ్యతలు చేపట్టిన మార్కెట్ కమిటీ సభ్యులను అభినందిస్తూ ఎమ్మెల్యే డాక్టర్ రాగమయి దయానంద్ మాట్లాడారు. గత రెండు సంవత్సరాలుగా జరిగిన అభివృద్ధి పనులను ప్రస్తావిస్తూ, నూతన కమిటీ ఆధ్వర్యంలో రైతుల సంక్షేమం కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఆకాంక్షించారు. కష్టపడి పనిచేసే వ్యక్తులకు తగిన గుర్తింపు లభిస్తుందని, నూతన చైర్మన్‌గా ఎన్నికైన నరసింహారావు ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు.


Market Committeeఈ సమావేశంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్‌కుమార్ మాట్లాడుతూ... గత ప్రభుత్వ హయాంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఎస్సీలకు రిజర్వు అయినప్పటికీ, నాటి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఎవరినీ నియమించకుండా నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధిని ఓర్వలేక బీఆర్ఎస్ నాయకులు వరదలను కూడా రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. ఇటీవల తుఫాన్ కారణంగా బేతుపల్లి వరద ఉద్ధృతి పెరిగినప్పుడు, అర్ధరాత్రి వరకు అక్కడే ఉండి మహిళా ఎమ్మెల్యే సహాయక చర్యలు చేపట్టిన విషయాన్ని గుర్తుచేశారు. బాధితులకు సాయం చేయకుండా విమర్శలు చేయడం తగదని హితవు పలికారు.


​ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ మొహమ్మద్ రెహానా కమల్, మండల, పట్టణ అధ్యక్షులు భీమిరెడ్డి సుబ్బారెడ్డి, గాదె చెన్నకేశవరావు, నాయకులు వెల్ది జగన్మోహనరావు, చంద్రశేఖరరెడ్డి, ఏఎంసీ నూతన పాలకవర్గ బాధ్యులు చైర్మన్ చల్లగుళ్ల నరసింహారావు, వైస్ చైర్మన్ వంట్ల కృష్ణార్జునరావు, డైరెక్టర్లు, ఏడిఏ వేమిరెడ్డి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్