నవతెలంగాణ -ముధోల్
మండలంలోని ఆష్ట గ్రామంలో భారత తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకొని గ్రామ సర్పంచ్ రావుల లావణ్య శ్రీనివాస్ అధ్యక్షతన బాల గ్రామ సభను శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా జవహర్ లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి విద్యార్థులు, సర్పంచు, పాలకవర్గ సభ్యులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. నెహ్రు జయంతి రోజున బాలల దినోత్సవాన్ని జరుపుకుంటామన్నారు. నెహ్రూకు పిల్లలంటే బాగా ఇష్టమని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల్లో సమస్యలు లేకుండా గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో అన్ని చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సావిత్ర కోటయ్య, అంగన్వాడి టీచర్లు, వార్డు సభ్యులు, వీడి సి, సభ్యులు, విద్యార్థులు, గ్రామస్థులు, తదితరులు పాల్గొన్నారు.
ఆష్ట గ్రామంలో బాల గ్రామసభ
14 నవంబర్, 2026

balaji
ప్రచురించబడింది నవం 14, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్లు (0)