Magazines

మందనపల్లిలో ఘనంగా బాలల దినోత్సవం

14 నిమిషాల క్రితం

Children's Day
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 14, 2026 | 1 నిమిషాల చదవడం

వేడుకల్లో పాల్గొన్న గ్రామ సర్పంచ్ సిరిమర్తి రేణుక నరసయ్య

నవతెలంగాణ – ఆలేరు రూరల్

ఆలేరు మండలం మదనపల్లి ప్రాథమిక పాఠశాలలో బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ సిరిమర్తి రేణుక నరసయ్య ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. బాలలే దేశ భవిష్యత్తు అని,విద్యార్థులు చిన్ననాటి నుంచే క్రమశిక్షణ,పట్టుదల,మంచి నడవడిక అలవర్చుకొని ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు.


ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించేందుకు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు సమిష్టిగా కృషి చేయాలని సూచించారు.

అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం.డి. సయ్యద్ మాట్లాడుతూ బాలల దినోత్సవ ప్రాముఖ్యతను వివరించారు. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని పేర్కొన్నారు. అనంతరం విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటపాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. చిన్నారుల ఉత్సాహభరిత ప్రదర్శనలతో పాఠశాల ప్రాంగణం సందడిగా మారింది.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ పద్మ శశిరేఖ,వార్డు సభ్యులు,ఉపాధ్యాయులు,గ్రామ ప్రజాప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్