Magazines

'మిరాకిల్ మైండ్స్' పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

14 నవంబర్, 2026

Children's Day
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 14, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-సత్తుపల్లి 

​సిద్ధారం రోడ్డులోని 'మిరాకిల్ మైండ్స్ - ది స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్' పాఠశాలలో శనివారం బాలల దినోత్సవ (చిల్డ్రన్స్ డే) వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సత్తుపల్లి మండల అభివృద్ధి అధికారి (ఎంపీడీఓ) రావెళ్ల చిన్న నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 


ముందుగా ఆయన మాజీ ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం చిన్నారులను ఆశీర్వదిస్తూ, పిల్లలే దేశానికి నిజమైన భవిష్యత్తు అని పేర్కొన్నారు. చిన్ననాటి నుంచే క్రమశిక్షణ, మంచి అలవాట్లు, చదువుపై శ్రద్ధ పెంచుకుంటే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని సూచించారు. నెహ్రూకు పిల్లలంటే ఎంతో ఇష్టమని, అందుకే ఆయన జయంతిని బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నామని వివరించారు.


పాఠశాల డైరెక్టర్, ప్రిన్సిపాల్ రత్నాకర్ మొండ్రు మాట్లాడుతూ...  విద్యార్థులను,  ఉపాధ్యాయులను అభినందిస్తూ 

ప్రతి విద్యార్థిలో ప్రత్యేకమైన ప్రతిభ దాగి ఉంటుందని, దానిని గుర్తించి ప్రోత్సహించడమే ఉపాధ్యాయుల ప్రధాన బాధ్యత అన్నారు.

పిల్లల చిరునవ్వు, ఆనందమే పాఠశాలకు అసలైన విజయమని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలు, పాటలు ఆహుతులను ఎంతగానో అలరించాయి. ఈ వేడుకల్లో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమం ముగింపు సందర్భంగా చిన్నారులందరికీ స్వీట్లు పంపిణీ చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్