నవతెలంగాణ - హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను మాతృ అభయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఉస్మానియా యూనివర్సిటీ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి నాయకులు, తెలంగాణ ఉద్యమకారుల ఆధ్వర్యంలో ఫౌండేషన్ నిర్వహిస్తున్న అనాథ పిల్లల వసతి గృహంలో కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా చిన్నారులకు పండ్లు, భోజనం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు మాట్లాడుతూ.. విద్యార్థుల బలిదానాలు, పోరాటాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అన్ని రంగాల్లో వెనక్కి నెట్టారని విమర్శించారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి జరుగుతోందని పేర్కొన్నారు.
తెలంగాణను భవిష్యత్తులో అన్ని రంగాల్లో దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దాలని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉస్మానియా యూనివర్సిటీ కాంగ్రెస్ పార్టీ నాయకులు డా. పొన్నం ముత్యం, డా. పెంచాల సతీష్, డా. జనగామ సంతోష్ తదితరులు పాల్గొన్నారు.







కామెంట్లు (0)