నవతెలంగాణ - తిరుమలగిరి
తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలోని తెలంగాణ చౌరస్తాలో ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను ఎమ్మెల్యే మందుల సామేలు ఆదేశానుసారం కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు వెంకట లక్ష్మారెడ్డి, మండల అధ్యక్షులు సుంకరి జనార్ధన్ ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుడిపాటి నరసయ్య ముఖ్యఅతిథిగా హాజరై కేక్ కట్ చేసి ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి పాదయాత్ర, వారి నాయకత్వమే నూతన కాంతిని అందించిందని, ఆయన సారథ్యంలోనే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని కొనియాడారు. అధికారంలోకి వచ్చిన స్వల్పకాలంలోనే రాష్ట్రంలో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వేగవంతం చేశారని తెలిపారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా తుంగతుర్తికి ప్రభుత్వ డిగ్రీ కళాశాలను, దాదాపు రూ. 200 కోట్ల వ్యయంతో ఇంటీగ్రేటెడ్ పాఠశాలలను తీసుకువచ్చిన ఘనత ఎమ్మెల్యే మందుల సామేలుకే దక్కిందన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పరిపాలిస్తున్న ఈ ప్రభుత్వానికి ప్రజలందరి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ, సీఎం రేవంత్ రెడ్డి మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుడిపాటి నరసయ్య, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సుంకరి జనార్దన్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ధరావత్ జుమ్మిలాల్ నాయక్, పట్టణ అధ్యక్షులు కేసిడి వెంకట లక్ష్మారెడ్డి, మాజీ మండల పార్టీ అధ్యక్షులు ఎల్సోజు నరేష్, పిఎసిఎస్ చైర్మన్ పాలేపు చంద్రశేఖర్, పేరాల విరేష్, కౌన్సిలర్లు తిరుమణి యాదగిరి, కేసిడి కవిత వెంకటరెడ్డి, బత్తుల శ్రీనివాస్, అంజయ్య, మల్లన్న, సర్పంచులు ధరావతు రామోజీ, చిరంజీవి, లక్ష్మణ్ నాయక్, రాజశేఖర్, బిచ్చు నాయక్, కిషన్, సతీష్ గౌడ్, బాలాజీ, వార్డు ఇన్చార్జీలు జంపాల భిక్షం, కందుకూరి లక్ష్మయ్య, ఉప్పలయ్య, వీరు నాయక్, పత్తిపురం సుధాకర్, మూల రాజు, సీనియర్ నాయకులు దుప్పటి మల్లయ్య, సుదర్శన్, నాయిని, అబ్బాస్, కృష్ణ, మోహన్, భాస్కర్, శ్రీనివాస్,తదితర కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు.







కామెంట్లు (0)