Magazines

ఏఐకేఎస్ జాతీయ మహాసభల ప్రారంభ సభకు తరలిరండి

6 గంటల క్రితం

AIKS
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 13, 2026 | 1 నిమిషాల చదవడం

- తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర నాయకులు కొక్కెరపాటి పుల్లయ్య పిలుపు

నవతెలంగాణ - అశ్వారావుపేట

ఈ నెల 15న నల్గొండలో జరగనున్న అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) జాతీయ మహాసభల ప్రారంభ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు రైతు సంఘం కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర నాయకులు కొక్కెరపాటి పుల్లయ్య పిలుపునిచ్చారు.


ఏఐకేఎస్ జాతీయ మహాసభల ప్రారంభ బహిరంగ సభకు జన సమీకరణపై సన్నాహకంగా అశ్వారావుపేట మండల కమిటీ సమావేశం శుక్రవారం స్థానిక ప్రజా సంఘాల కార్యాలయం సుందరయ్య భవన్‌లో నిర్వహించారు. మండల కమిటీ కార్యదర్శివర్గ సభ్యులు ముల్లగిరి గంగరాజు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి పుల్లయ్య హాజరై మాట్లాడారు.


జాతీయ మహాసభల సందర్భంగా నిర్వహించే ప్రారంభ బహిరంగ సభలో జాతీయ, రాష్ట్ర స్థాయి నాయకులు పాల్గొని ప్రసంగిస్తారని తెలిపారు. అశ్వారావుపేట ప్రాంతం నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలను సమీకరించి సభను విజయవంతం చేయాలని కోరారు. సభకు వెళ్లే కార్యకర్తలు సకాలంలో బయలుదేరి సభా ప్రాంగణానికి చేరుకునేలా బాధ్యులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు బుడితి చిరంజీవి, మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యురాలు తగరం నిర్మల, మండల కార్యదర్శివర్గ సభ్యులు మడకం గోవిందు, మడిపల్లి వెంకటేశ్వరరావు, మండల కమిటీ సభ్యులు నారం అప్పారావు, కుంజా మురళి తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్