Magazines

రూపశ్రీ కౌంటీలో కమ్యూనిటీ హాల్ ప్రారంభం

1 గంట క్రితం

Community hall
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 01, 2026 | 1 నిమిషాల చదవడం

ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి
నవతెలంగాణ - అమీన్‌పూర్ 
అమీన్‌పూర్ డివిజన్ పరిధిలోని రూపశ్రీ కౌంటీ కాలనీలో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హాల్‌ను ఆదివారం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అమీన్‌పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి విచ్చేశారు. ఈ సందర్భంగా కాలనీ సంక్షేమ సంఘం నాయకులు, కాలనీవాసులు ఆయనకు ఘన స్వాగతం పలికి, శాలువాలు, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. అనంతరం తుమ్మల పాండురంగారెడ్డి రిబ్బన్ కట్ చేసి నూతన కమ్యూనిటీ హాల్‌ను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రూపశ్రీ కౌంటీ కాలనీ రోజురోజుకూ అభివృద్ధి పథంలో దూసుకుపోతుండటం ఎంతో సంతోషకరమన్నారు.


గతంలో తాను చైర్మన్‌గా ఉన్న హయాంలో అమీన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలోని అన్ని కాలనీల మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేశామని గుర్తుచేశారు. నిరంతరాయంగా సీసీ రోడ్లు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థలు, విద్యుత్ దీపాలు, తాగునీటి సరఫరా వంటి ఎన్నో అభివృద్ధి పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేశామని తెలిపారు.అమీన్‌పూర్ ప్రాంతం శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరానికి సమీపంలో ఉండటంతో ఇతర ప్రాంతాల నుంచి ఎంతో మంది తమ కష్టార్జితంతో ఇక్కడ స్థలాలు, ఇళ్లు కొనుగోలు చేసి స్థిరపడుతున్నారని పేర్కొన్నారు. బయటి నుంచి వచ్చి మన ప్రాంతాన్ని నమ్ముకున్న ప్రతి ఒక్కరికీ అండగా నిలవడం తమ బాధ్యతని, ఇక్కడ నివసిస్తున్న ప్రజలందరూ తమ కుటుంబ సభ్యులతో సమానమని అన్నారు.


భవిష్యత్తులో కూడా రూపశ్రీ కౌంటీతో పాటు పరిసర కాలనీల అభివృద్ధికి, ప్రజల సమస్యల పరిష్కారానికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ ముందుంటుందని స్పష్టం చేశారు. కమ్యూనిటీ హాల్ నిర్మాణంతో కాలనీవాసుల సామూహిక కార్యక్రమాలు, వేడుకలకు ఎంతో వెసులుబాటు కలుగుతుందని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ సీనియర్ నాయకుడు కొల్లూరు గోపాల్,కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు, స్థానిక ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు మరియు కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్