Magazines

ఇందిరమ్మ ఇంట్లో దీపావళి వేడుకలు 

09 నవంబర్, 2026

Diwali
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 09, 2026 | 1 నిమిషాల చదవడం

- లబ్దిదారులతో కలిసి పండుగ సంబురాల్లో పాల్గొన్న ఎంపీ, ఎమ్మెల్యే 

నవతెలంగాణ-ఆమనగల్ : ఆమనగల్ పట్టణంలో ఆదివారం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు పూర్తయిన ఇండ్ల వద్ద దీపావళి పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమంలో నాగర్ కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి పాల్గొని లబ్దిదారులు, స్థానిక నాయకులతో కలిసి దీపావళి పండుగ సంబురాలను జరుపుకున్నారు. మున్సిపల్ చైర్మెన్ డాక్టర్ పత్య నాయక్, కమిషనర్ రాఘవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈకార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మెన్ గూడూరు శ్రీనివాస్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు యాట నర్సింహ ముదిరాజ్, ఏఎంసీ మాజీ వైస్ చైర్మెన్ గుర్రం కేశవులు, నాయకులు కృష్ణ నాయక్, విజయ్, మధుసూదన్ రెడ్డి, పూసల సత్యం, ఫరీద్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్