జిల్లా వ్యవసాయ అధికారి అసం రవి
నవతెలంగాణ-కుభీర్
ఆరుతడి పంటలను ప్రోత్సహించేలా ప్రతి ఒక్క రైతు కృషి చేయాలని జిల్లా వ్యవసాయ అధికారి అసం రవి అన్నారు. శనివారం మండల కేంద్రమైన కుభీర్ లోని పొలం బడి కార్యక్రమానికి ముఖ్య అతితిగా హాజరై మాట్లాడారు. ఈఏడాది లో ఎల్ నీ నో ప్రభావం వల్ల భూగర్భ జలాలు తగ్గిపోయి పంటలు తక్కువ మొత్తం లో దిగుబడులు వచ్చి రైతులు తీవ్రంగా నష్టపోయారని గుర్తు చేశారు.
అదేవిదంగా రాభి సీజనలో తక్కువ నీటి తో పండే పంటలు నువ్వులు, సజ్జలు, జొన్నలు,పెసర, మినుములు వంటి పంటలను సాగుచేసుకోవాలని తెలపారు. నాణ్యమైన విత్తనాలు, శుద్ధి ఎంపిక ప్రాముఖ్యత రైతులు విత్తనా శుద్ధి తప్పనిసరిగా చేసుకోవాలని అన్నారు. పంటలకు ఆశించే చీడ పీడ నివారణ చర్యలపై రైతులకు అవగహన కల్పించారు. వ్యవసాయ మండల అధికారి సారిక చెర్మన్ కళ్యణ్ ఆత్మ కమిటీ చెర్మన్ వివేకానంద వ్యవసాయ విస్తీరణ అధికారులు రైతులు తదితరులు పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)