Magazines

చెన్నంపల్లి గ్రామంలో గ్రంథాలయం ఏర్పాటుకు కృషి 

09 నవంబర్, 2026

Chennampally
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 09, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-ఆమనగల్ : మండలంలోని చెన్నంపల్లి గ్రామంలో గ్రామీణ గ్రంథాలయం ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు స్థానిక సర్పంచ్ తెల్గమల్ల ప్రశాంతి రవికుమార్ తెలిపారు. ఈమేరకు ఆదివారం ఏఐసీసీ కార్యదర్శి డాక్టర్ చల్లా వంశీచంద్ రెడ్డిని హైదరాబాద్ లోని తన కలిసి గ్రంథాలయం ఏర్పాటుకు సహకరించాలని కోరినట్లు సర్పంచ్ సర్పంచ్ ప్రశాంతి రవికుమార్ తెలిపారు. గ్రంథాలయం ఏర్పాటుకు తనవంతు సహాయ సహకారాలు అందిస్తానని వంశీచంద్ రెడ్డి హామీ ఇచ్చినట్లు వారు పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో డీసీసీ కార్యదర్శి రమణారెడ్డి, రాఘవేందర్ రెడ్డి, వార్డు సభ్యులు కృష్ణయ్య, మల్లేష్, లక్ష్మయ్య, నర్సింహ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్