Magazines

కొడంగల్ రైతు సదస్సుకు భారీగా తరలిన రైతులు

1 రోజు క్రితం

Kodangal farmers
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 09, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-మిడ్జిల్

కొడంగల్ నియోజకవర్గంలోని లగ్చర్లలో వేదికగా జరుగుతున్న ప్రతిష్టాత్మక 'మెగా రైతు మేళా' సదస్సుకు మిడ్జిల్ మండలం నుండి అన్నదాతలు, వ్యవసాయ అధికారులు, మహిళా రైతులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీ ఎత్తున తరలివెళ్లారు. సోమవారం మండల కేంద్రంతోపాటు, వాడియాల మున్న నూర్, వల్లభ రావు పల్లి, చిల్వేర్, మసిగుండ్లపల్లి, పెద్ద గుండ్ల తాండ, వివిధ గ్రామాల నుండి రైతులు, స్థానిక సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు మరియు కార్యకర్తలు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆర్టీసీ బస్సులలో

కొడంగల్ సదస్సుకు వెళ్లారు.


రైతులకు ఆధునిక సాగు పద్ధతులు, నూతన వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానం డ్రోన్ వినియోగం, దేశీయ విత్తనాలు మరియు లాభదాయకమైన ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన కల్పించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తెలిపారు.


ఈ కార్యక్రమంలో సర్పంచుల సంఘం మండల అధ్యక్షులు ఎడ్ల శంకర్ ముదిరాజ్, వ్యవసాయ అధికారి సిద్ధార్థ ,పిఎసిఎస్ సీఈవో బాల్ రెడ్డి,వివిధ గ్రామాల సర్పంచులు రాజు నాయక్, శ్రీశైలం యాదవ్, నాగరాజు ,గౌడ్, రాములు, సాయిలు ,మల్లికార్జున రెడ్డి, నరేందర్ రెడ్డి, నర్సింలు, పెద్ద గుండ్ల తాండ ఉప సర్పంచ్ శ్రీనివాస్ నాయక్, జహంగీర్, వ్యవసాయ విస్తీర్ణ అధికారులు శివలీల, అస్త్ర ఫాతిమా, అనిత శివప్రసాద్, గౌస్ పాషా, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆదాం, సత్యం గౌడ్, లింగం, వివిధ గ్రామాల సర్పంచులు మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్