Magazines

నార్సింగి హైరైజ్ అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం...

4 గంటల క్రితం

Fire Accident
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 19, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ నార్సింగి: నార్సింగి పరిధిలోని ‘పసిఫికా హిలెస్ట్’ హైరైజ్ అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అపార్ట్‌మెంట్‌లోని ఓ బ్లాక్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగి 12వ అంతస్తు నుంచి 18వ అంతస్తు వరకు వ్యాపించాయి.దీంతో భయాందోళనకు గురైన నివాసితులు ప్రాణభయంతో కిందకు పరుగులు తీశారు.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని,నాలుగు ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు.ఈ ప్రమాదంలో ఫాల్ సీలింగ్ పూర్తిగా కాలిపోగా,ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.




సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్