నవతెలంగాణ-మర్రిగూడ
మండలంలోని దామెర భీమనపల్లి గ్రామానికి చెందిన మాజీ ఎంపిటిసి సిలువేరు విష్ణు తన అనుచరులతో కలిసి కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలో చేరారు.గురువారం గట్టుప్పల్ మండల కేంద్రంలో జరిగిన ఓ కార్యక్రమంలో రాష్ట్ర మాజీ మంత్రి,సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సమక్షంలో ఆయనను కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా విష్ణు మాట్లాడుతూ అందరిని కలుపుకొని పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో మాల్ మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మెన్ దంటు జగదీశ్వర్ జగదీశ్,కంటెస్టెంట్ సర్పంచ్ నడిమింటి శ్రీను,బి ఆర్ ఎస్ వార్డు సభ్యులు,తదితరులు పాల్గొన్నారు.






కామెంట్లు (0)