నవతెలంగాణ-సత్తుపల్లి
సత్తుపల్లి మండలం కొత్తూరు మదర్ థెరెసా కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ విద్యార్థిని జాలాది హరిత కాకతీయ యూనివర్సిటీ పరిధిలో బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఎడ్) కోర్సులో బంగారు పతకం (గోల్డ్ మెడల్) సాధించారు. శనివారం జరిగిన కాకతీయ యూనివర్సిటీ 24వ స్నాతకోత్సవంలో రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల చేతుల మీదుగా ఆమె ఈ పురస్కారాన్ని అందుకున్నారు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన హరితను మదర్ థెరెసా విద్యాసంస్థల అధ్యక్షులు చలసాని సాంబశివరావు, సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ డాక్టర్ చలసాని హరికృష్ణ, ప్రిన్సిపాల్ డాక్టర్ ఎల్వీఆర్ దీక్షితులు, అధ్యాపకులు, విద్యార్థులు అభినందించారు.





కామెంట్‌లు (0)