- కాకర్లపల్లి వద్ద నిరుపయోగంగా ఉన్న పాత ఎన్టీఆర్ కాలువను పూడ్చించి అర్హులకు ఇవ్వాలని డిమాండ్
- సీపీఐ(ఎం) సత్తుపల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశం
నవతెలంగాణ-సత్తుపల్లి సత్తుపల్లి మండలంలోని నిరుపేదలకు తక్షణమే ఇండ్ల స్థలాలు, ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాలని, కాకర్లపల్లి గ్రామం పక్కనే నిరుపయోగంగా ఉన్న పాత ఎన్టీఆర్ కాలువను సింగరేణి మట్టితో పూడ్చించి ఆ స్థలాన్ని అర్హులైన పేదలకు కేటాయించాలని సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. శనివారం సత్తుపల్లిలోని విశ్వశాంతి స్కూల్ వద్ద సీపీఐ(ఎం) మండల కమిటీ ఆధ్వర్యంలో వేపులపాటి కుమారస్వామి అధ్యక్షతన ఈ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో సీపీఐ(ఎం), సీపీఐ, బీఆర్ఎస్, సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ పార్టీలతో పాటు మాల మహానాడు, ఎమ్మార్పీఎస్, గిరిజన సంఘం, ఇతర ప్రజా, కుల సంఘాల నాయకులు పాల్గొని ప్రసంగించారు. కాకర్లపల్లి సమీపంలోని పాత ఎన్టీఆర్ కాలువను పూడ్చి పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని గత రెండేళ్లుగా అధికారులు, స్థానిక ఎమ్మెల్యే, మంత్రులకు వినతులు ఇచ్చినా ఫలితం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ధర్నాలు, పాదయాత్రలు, నిరాహార దీక్షలు చేపట్టడంతో స్పందించిన అధికారులు కాలువను సర్వే చేసి 32 ఎకరాల భూమిని గుర్తించారని తెలిపారు.
ఆ స్థలాన్ని అర్హులైన పేదలకు కేటాయిస్తామని హామీ ఇచ్చి ఏడాది గడుస్తున్నా నేటికీ అమలు కాలేదని విమర్శించారు. ఇతర ప్రాంతాల్లో నిరుపయోగంగా ఉన్న కాలువలను పూడ్చినప్పటికీ, కాకర్లపల్లి విషయంలో మాత్రం తీవ్ర జాప్యం జరుగుతోందన్నారు. ఇళ్ల స్థలాలు లేక పేద కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత శాఖల అధికారులు తక్షణమే స్పందించి కాలువను పూడ్చి ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని కోరారు. పేదలకు నివాస స్థలం కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని, ఈ పోరాటంలో అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ఐక్యంగా ముందుకు రావాలని నాయకులు పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు జాజిరి శ్రీనివాస్, మోరంపూడి పాండురంగారావు, చలమాల విఠల్ రావు, సీపీఐ జిల్లా నాయకులు దండు ఆదినారాయణ, మాస్ లైన్ నాయకులు అమర్లపూడి శరత్, బీఆర్ఎస్ నాయకులు కంచర్ల నాగేశ్వరరావు, కాకర్లపల్లి సర్పంచ్ పొదిలి మారేశ్వరరావు, మాల మహానాడు పట్టణ అధ్యక్షులు పిల్లి మల్లికార్జున్, లక్ష్మీనారాయణ, ఎమ్మార్పీఎస్ నాయకులు పరిగడుపు లక్ష్మణరావు, తడికమళ్ల దాసు, గొళ్లమూడి శ్రీనివాసరావు, హెచ్. వెంకటేశ్వరరావు, గ్రామీణ వైద్యుల సంఘం డివిజన్ అధ్యక్షులు మేకపోతుల లాలేశ్వరరావు, రైతు సంఘం డివిజన్ కార్యదర్శి రావుల రాజబాబు, సీపీఎం పట్టణ కార్యదర్శి కొలికపోగు సర్వేశ్వరరావు, మండల కార్యదర్శి జాజిరి జ్యోతి, సీఐటీయూ జిల్లా నాయకులు మల్లూరు చంద్రశేఖర్, అడ్వకేట్ సుదర్శన్ రావు, తడికమళ్ల అర్జునరావు, రైతు సంఘం మండల కార్యదర్శి బాల బుచ్చయ్య, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి కువ్వారపు లక్ష్మణరావు, సీఐటీయూ మండల కన్వీనర్ కావూరి వెంకటేశ్వరరావు, బండి వేలాద్రి, తడికమళ్ల రామకృష్ణ, అయినంపూడి సనందరావు, ఎలగం కృష్ణ, దాట్ల రాంబాబు, కొప్పుల చిన్నస్వామి, లక్ష్మి, బలగాని దేవి, సరోజిని పాల్గొన్నారు.





కామెంట్లు (0)