Magazines

రోడ్డు మధ్యలో చేతి పంపు.. 

2 గంటల క్రితం

Hand pump
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 09, 2026 | 1 నిమిషాల చదవడం

- ప్రమాదాలకు ఆహ్వానం!

నవతెలంగాణ - అశ్వారావుపేట

అశ్వారావుపేట మండలం ఆసుపాక పంచాయతీ పరిధిలోని ఆసుపాక కాలనీ సోడెం వారి వీధిలో నిర్మించిన సీసీ రోడ్డు మధ్యలో చేతి పంపు ఉండటం స్థానికులను ఆందోళనకు గురిచేస్తోంది. సుమారు 30 ఏళ్ల క్రితం ఆ వీధిలో ప్రజల తాగునీటి అవసరాల కోసం చేతి పంపును ఏర్పాటు చేశారు. అయితే ఇటీవల, సుమారు మూడు నెలల క్రితం, అదే వీధిలో సీసీ రహదారి నిర్మాణం చేపట్టారు.


రహదారి నిర్మాణానికి ముందు చేతి పంపును శాశ్వతంగా తొలగించడం లేదా రహదారి ఎలైన్‌మెంట్‌ను మార్చడం వంటి చర్యలు చేపట్టాల్సి ఉన్నప్పటికీ, అవేమీ చేయకుండా చేతి పంపును రోడ్డు మధ్యలోనే ఉంచి సీసీ రహదారిని నిర్మించారు.

దీంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో ద్విచక్ర వాహనదారులు, చిన్నారులు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రమాదాలు జరగకముందే సంబంధిత అధికారులు స్పందించి, చేతి పంపును తొలగించడం లేదా సురక్షితమైన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్