Magazines

ప్రత్యక్ష రాజకీయాల్లోకి హోంగార్డు

4 రోజుల క్రితం

Home Guard
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 20, 2026 | 1 నిమిషాల చదవడం

- మాజీ మంత్రి హరీష్ రావు సమక్షంలో బీఆర్ఎస్ లో చేరిక

- పుల్కల్ గ్రామ సర్పంచ్ భర్త కృష్ణారెడ్డి

నవతెలంగాణ-పుల్కల్

హోంగార్డుగా విధులు నిర్వర్తిస్తున్న కృష్ణారెడ్డి తన ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రత్యక్ష రాజకీయ పోరుకు సిద్ధపడ్డాడు. ఇందులో భాగంగా గురువారం మాజీ మంత్రి హరీష్ రావు స్వగృహంలో ఆందోల్ మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ నేతృత్వంలో తన అనుచర గణంతో బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ..కృష్ణారెడ్డి సేవలు పార్టీ బలోపేతానికి అవసరమని అన్నారు.


కాంగ్రెస్ ప్రభుత్వంలో నీచ రాజకీయాలు నడుస్తున్నాయని, సామాన్య వ్యక్తులపై వేధింపులు విపరీతంగా పెరిగిపోయాయని మండిపడ్డారు. ప్రభుత్వ ఉద్యోగులను ఏదో విధంగా భయపెడుతూ తమ అధికార దాహాన్ని తీర్చుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగాన్ని తృణ ప్రాయంగా పక్కన పెట్టి ఆత్మాభిమానంతో బీఆర్ఎస్ పార్టీలోకి రావడం సంతోషదాయకమన్నారు.


ఈ కార్యక్రమంలో పుల్కల్ సర్పంచ్ లావణ్య కృష్ణారెడ్డి, ముదిమానిక్ సర్పంచ్ పడమటి రమేష్, రాయిపాడు సర్పంచ్ లక్ష్మి రాజు, మిన్ పూర్ ఉప సర్పంచ్ రమేష్, నాయకులు సుభాష్ రెడ్డి, పుల్కల్ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మాచర్ల విజయ్ కుమార్, పుల్కల్ మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్ చారి, నాయకులు మల్లారెడ్డి, లక్ష్మణ్ చారి, మంగలి ప్రభాకర్, పోచారం నర్సింలు, అవుసలి నాగప్ప, బెస్త శ్రీనివాస్, మంగలి రాజా, రామ్, పోచన్నగారి మాణిక్యం, తలారి రాములు, డప్పూరి మానేయ, దశరథ్, లక్ష్మణ్, ప్రభాకర్, ఏసురత్నం భుజంగం, సంగమేష్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్