నవతెలంగాణ-మల్హర్ రావు
41 లీటర్ల గుడుంబా, 700 లీటర్ల గుడుంబా పానకాన్ని కొయ్యూర్ పోలీసులు గురువారం ధ్వసం చేశారు. మండల కేంద్రమైన తాడిచెర్లతో పాటు కాపురం మామిడి తోటలు, అటవీ గుట్టలు, పత్తి చేన్లలో తదితర రహస్య ప్రాంతాల్లో ప్రభుత్వ నిషేదిత గుడుంబా తయారు చేస్తన్నారనే పక్కా సమాచారం మేరకు దాడులు నిర్వహించామని ఎస్ఐ మహేందర్ కుమార్ తెలిపారు. ఈ దాడుల్లో అనుముల హరీష్, చిగురు క్రాంతి కుమార్, బోనగిరి రాజయ్య, జోడు రవి, డోల్క చిన మల్లయ్య, బోనగిరి ఓదెలు పాల్గొని ఆరుగురు నిర్వాహకులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. ఈ మేరకు రూ.3 లక్షల పూచీకథతో మండల తహశీల్దార్ రవికుమార్ ముందు బైండోవర్ చేశారు. ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు మళ్ళీ పాల్పడితే రూ.3 లక్షల జరిమానా..జైలు శిక్షతో పాటు షార్జ్ షీట్స్ ఓపెన్ చేస్తామని ఎస్ఐ హెచ్చరించారు.







కామెంట్‌లు (0)