Magazines

అనుమతులు లేకుండా ఇసుక తరలింపు.. రెండు ట్రాక్టర్లు పట్టివేత

14 నవంబర్, 2026

tractors
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 14, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - యాలాల: ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను యాలాల పోలీసులు పట్టుకున్నారు. శుక్రవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. యాలాల ఎస్‌ఐ విఠల్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. జక్కేపల్లికి చెందిన బ్యాగరి నరేష్‌ ఒక ట్రాక్టర్‌లో, బెన్నూరుకు చెందిన ఎండీ ముజీబ్‌ నంబర్‌ ప్లేట్‌ లేని మహీంద్రా 575 ట్రాక్టర్‌లో ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన పోలీసులు రెండు ట్రాక్టర్లను పట్టుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనపై సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమ ఇసుక రవాణాకు పాల్పడితే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్