రూ.30 లక్షల వీబీజీ రామ్ నిధులతో నిర్మాణ పనులకు శంకుస్థాపన
సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు గుగులోతు బాబురావు
నవతెలంగాణ–నర్సింహులపేట
నూతన గ్రామపంచాయతీ భవనం (జిపి), మహిళా సమాఖ్య (వీవో) భవనాల నిర్మాణంతో ప్రజలకు పాలనా సౌకర్యాలు మరింత మెరుగుపడతాయని స్థానిక సర్పంచ్, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు గుగులోతు బాబురావు అన్నారు. శనివారం మండలంలోని నరసింహపురం బంజరలో జిపి భవన భవనానికి సుమారు రెండు గుంటల స్థలాన్ని రావణబోయిన సైదులు జ్ఞాపకార్థం వారి కుమారులు వెంకన్న, జగదీష్ అందజేశారు. రూ.30 లక్షల వీబీజీ రామ్ నిధులతో చేపట్టనున్న నూతన గ్రామపంచాయతీ భవనం, మహిళా సమాఖ్య (వీవో) భవన నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ డాక్టర్ జాటోత్ రామచంద్రునాయక్ సహకారంతో మండలంలోని పలు గ్రామపంచాయతీలకు నూతన భవనాలు మంజూరవుతున్నాయని తెలిపారు. వీటి నిర్మాణం పూర్తయితే గ్రామాల్లో పాలనా సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు మహిళా సంఘాల కార్యకలాపాలకు ప్రత్యేక వసతి అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు. నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొబ్బ సోమిరెడ్డి, మాజీ అధ్యక్షుడు జినుకల రమేష్, సమన్వయ కమిటీ చైర్మన్ దస్రు నాయక్, పెద్దనాగారం స్టేజీ సర్పంచ్ భర్త హరిలాల్, ఉపసర్పంచ్ నీలం లక్ష్మి శివయ్య, గ్రామ పార్టీ అధ్యక్షుడు నీలం వెంకన్న, వార్డు సభ్యులు సైదులు, వీరన్న, వెంకన్న, రమేష్, కార్యదర్శి ఉమేష్, వర్క్ ఇన్స్పెక్టర్ రాజేష్, మండల కార్యదర్శి అనిల్ నాయక్, నాయకులు నర్సయ్య, వెంకన్న, శ్రీను, రామచంద్రు, మాంగ్య తదితరులు పాల్గొన్నారు.






కామెంట్లు (0)