నవతెలంగాణ-వర్ధన్నపేట
ఇందిరా గాంధీ జయంతి వేడుకలను గురువారం వర్ధన్నపేట అంబేద్కర్ చౌరస్తాలో మండల కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వర్ధన్నపేట మున్సిపాలిటీ చైర్మన్ పాలకుర్తి సారంగపాణి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పోశాల వెంకన్న, ఐఎన్టియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి ఉపేందర్, తదితరులు హాజరై ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీ చైర్మన్ పాలకుర్తి సారంగపాణి మాట్లాడుతూ.. ఇందిరమ్మ అనుసరించిన పాలనలోనే ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు. ఇందిరాగాంధీ తుది శ్వాస వరకు ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం పాటుపడ్డారని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ వైస్ చైర్మన్ నేతావత్ షిబా రాణి రాజేందర్ గారు 12వ డివిజన్ కౌన్సిలర్ తిరుపెల్లి వాణికుమార్ స్వామి పాక్స్ డైరెక్టర్లు 8వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బక్కతట్ల రాజు యాదవ్ కొండేటి మహేందర్ సర్పంచ్ చిటూరి రాజు, వీర గ్రామాల పార్టీ నాయకులు ఎద్దు రాజేంద్రప్రసాద్, యాదగిరి ,తీగల సునీత గౌడ్ ,రాఖీ ముదిరాజు పట్టణ నాయకురాలు లింగం రజిత రెడ్డి, మరుపట్ల సాయి, లింగం రజిత రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నారెల్లి కమలాకర్ ఐఎన్టియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి దీకొండ ఉపేందర్ ఐఎన్టియుసి జిల్లా ఉపాధ్యక్షులు పోశాల మధుకర్ జిల్లా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు మల్లెపాక సమ్మయ్య కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అనిమి రెడ్డి రామచంద్రారెడ్డి మాజీ కౌన్సిలర్లు మంచాల రామకృష్ణ తుమ్మల రవీందర్ వర్ధన్నపేట మండలం సోషల్ మీడియా కన్వీనర్ తుమ్మల కుమారస్వామి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.






కామెంట్లు (0)