Magazines

ప్రజా సమస్యల పరిష్కారంలో పాత్రికేయులు కీలక పాత్ర పోషించాలి

13 నవంబర్, 2026

Nizam sagar
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 13, 2026 | 1 నిమిషాల చదవడం

- కామారెడ్డి డిసిసి అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ 

నవతెలంగాణ-నిజాంసాగర్ : సమాజంలో జరుగుతున్న పరిణామాలను ప్రజలకు తెలియజేస్తూ, ప్రజా సమస్యల పరిష్కారంలో పాత్రికేయులు కీలక పాత్ర పోషించాలని డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ సూచించారు. ఉమ్మడి నిజాంసాగర్–మహమ్మద్ నగర్ మండలాల నూతన ప్రింట్ మీడియా సంఘం అధ్యక్షుడు పాల్త్య రాములు నాయక్, ఉపాధ్యక్షులు బాలరాజ్ (సాక్షి), మహమ్మద్ జునేద్ (దిశ)తో పాటు నూతన కార్యవర్గ సభ్యులు శుక్రవారం నిజాంసాగర్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏలే మల్లికార్జున్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనను శాలువాతో సత్కరించగా, నూతన కమిటీ సభ్యులను కూడా ఏలే మల్లికార్జున్ శాలువాలతో సత్కరించి అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో మీడియా నాలుగో స్తంభంగా కీలక బాధ్యతలు నిర్వహిస్తోందన్నారు. క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వెలుగులోకి తీసుకురావడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల సమాచారాన్ని ప్రజలకు చేరవేయడంలో పాత్రికేయుల సేవలు ప్రశంసనీయమన్నారు. నూతన కార్యవర్గం పరస్పర సహకారం, ఐక్యతతో పనిచేస్తూ జర్నలిస్టుల హక్కులు, సంక్షేమం కోసం కృషి చేయాలని ఆకాంక్షించారు.అనంతరం నూతన ప్రింట్ మీడియా సంఘం ప్రతినిధులు నిజాంసాగర్ ఎస్ఐ శివకుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ వార్తల ప్రచురణలో వాస్తవాలకు ప్రాధాన్యతనిస్తూ, ప్రజలకు ఉపయోగపడే సమాచారాన్ని అందించాలని సూచించారు. సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజా సమస్యల పరిష్కారంలో పోలీసు శాఖకు, ప్రజలకు మధ్య మీడియా వారధిగా పనిచేస్తుందని పేర్కొంటూ నూతన కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో విలేకరులు రెడ్డి శెట్టి భాస్కర్, చాకలి రమేష్, నవీన్, ఎండీ గౌస్, రాజేందర్ రెడ్డి, చైతన్య, గుంటి దశరథ్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్