Magazines

డేంజర్ జోన్‌లో ఉన్న ప్రతి కుటుంబానికి న్యాయం చేయాలి..

9 గంటల క్రితం

Malharo
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 16, 2026 | 1 నిమిషాల చదవడం

- కలెక్టర్,సబ్ కలెక్టర్ లకు తాడిచెర్ల సర్పంచ్ స్వామి వినతి

నవతెలంగాణ-మల్హర్ రావు : మండల కేంద్రమైన తాడిచెర్ల ఓసిపి బ్లాక్-1కు 500 మీటర్ల డేంజర్ జోన్లోవున్న ప్రతి భూ నిర్వాసిత కుటుంబానికి న్యాయం చేయాలని భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ,ఆదనపు కలెక్టర్ అశోక్ కుమార్,కాటారం సబ్ కలెక్టర్ సౌరబ్ శర్మలకు తాడిచెర్ల గ్రామ సర్పంచ్ బండి స్వామి సోమవారం ప్రజావాణిలో వినపత్రాన్ని అందజేశారు.గని ఉపరితలంలో వ్యవసాయ భూములు కోల్పోయి ఎలాంటి జీవనోపాధి లేక ప్రజలు అల్లాడుతున్నారని,ఈ సమయంలో డేంజర్ జోన్లో ప్రజలు నివాసముండే గృహాలు కూడా కోల్పోతున్నారు కాబట్టి తగిన న్యాయం చేయాలని కోరారు.పూర్వం నుండి నివసించే అత్యధికంగా జనాభా కలిగి ఉన్న ఎస్సీ మాదిగ,ఎస్సీ మాల,బీసీ,ఎస్టీ, ఇతరులు సంబంధించిన ప్రజలు కటిక పేదరికంలో కొట్టుమిట్టాడుతు,ఆర్థికంగా చితకలపడి ఇబ్బందుల్లో ఉన్నారని, పిల్లలను పోషించడానికి చాలా దయనీయంగా కష్టపడుతున్నారని వివరించారు.తమ సర్వస్వము ఓపెన్ కాస్ట్ మైన్ కు ప్రజలు ధారాదత్తం చెసి,సహకరించినారు కావున అధికారులు అన్ని విధముల పరిగెల్లోనకు తీసుకొని ఆలోచించి మానవీయ కోణంలో ప్రజల కోసం ఆలోచన చేసి ప్రజల సమస్య ప్రభుత్వం,ఉన్నత మైన అధికారులకు దృష్టికి తీసుకపోయి న్యాయం చేయాలన్నారు.కుటుంబంలో పెళ్లిళ్లు చేసుకున్నవారిని దృష్టిలో ఉంచుకొని ఉండటానికి ఇల్లు నిర్మాణం చేసుకున్న నేపథ్యంలో అర్హులైన ప్రతి ఒక్కరికి,అలాగే జీపీ రికార్డులు,విద్యుత్ మిటర్,ఇంటిపన్నులు చెల్లించిన అర్హులైన నిర్వాసితులకు గ్రామపంచాయతీ పరిధిలో అనువైన ప్రదేశంలో అన్ని సౌకర్యాలతో ఆర్ అండ్ ఆర్ ప్యాకేజి,పునరావాసం కల్పచించేలా ఈ నెల 23న గ్రామంలో నిర్వహించే ప్రజాభిప్రాయ సేకరణ గ్రామసభలో పరిష్కారం చూపాలని విన్నవించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్