Magazines

జేవీఆర్ డిగ్రీ కళాశాల గోల్డెన్ జూబ్లీ వేడుకలు

09 నవంబర్, 2026

JVR Degree College
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 09, 2026 | 1 నిమిషాల చదవడం

- డిసెంబర్ 19, 20 తేదీల్లో నిర్వహణ
- రూ. 20 లక్షలతో ఆర్చీ నిర్మాణం

- నిర్వహణ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ దయానంద్ విజయకుమార్ 

నవతెలంగాణ-సత్తుపల్లి 

​సత్తుపల్లి జలగం వెంగళరావు ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్థాపించి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా డిసెంబర్ 19, 20 తేదీల్లో గోల్డెన్ జూబ్లీ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు నిర్వహణ కమిటీ అధ్యక్షులు డాక్టర్ మట్టా దయానంద్ విజయకుమార్ తెలిపారు. ఈ ఉత్సవాల్లో భాగంగా కళాశాల ఎదుట రూ. 20 లక్షల వ్యయంతో ఆకర్షణీయమైన ప్రధాన ఆర్చీ (ప్రవేశ ద్వారం) నిర్మించనున్నట్లు డాక్టర్  దయానంద్ పేర్కొన్నారు. సోమవారం కమిటీ సభ్యులతో కలిసి ఆర్చీ నిర్మాణ ప్రదేశాన్ని దయానంద్ పరిశీలించారు. పనులను వేగవంతం చేసి నెల రోజుల్లోగా నిర్మాణం పూర్తి పూర్తిచేసే కార్యక్రమానికి కసరత్తు చేపట్టారు. 1976 జూన్ 7న ప్రారంభమైన ఈ కళాశాల అర్ధ శతాబ్ది కాలంగా విద్యారంగంలో విశేష సేవలు అందిస్తోందని పేర్కొన్నారు.

రెండు రోజుల పాటు సాగే ఈ స్వర్ణోత్సవాలకు 1976 నుంచి ఇప్పటివరకు కళాశాలలో పనిచేసిన అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బందిని, పూర్వ విద్యార్థులను అలాగే వివిధ రంగాల్లో స్థిరపడిన ప్రముఖులను ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు.

*ఈ నెల 13న సన్నాహక సమావేశం

వేడుకల నిర్వహణ, ఏర్పాట్లు, ఇతర ముఖ్యాంశాలపై చర్చించేందుకు ఈనెల 13న కళాశాల ప్రాంగణంలో సన్నాహక సమావేశం ఏర్పాటు చేసినట్లు డాక్టర్  దయానంద్ వెల్లడించారు. దేశ, విదేశాల్లో స్థిరపడిన పూర్వ విద్యార్థులు, కళాశాల అభిమానులు ఈ సమావేశానికి హాజరై తమ అమూల్యమైన సలహాలు, సూచనలతో పాటు ఆర్థిక, నైతిక సహకారాన్ని అందించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ​ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ నండ్రు  గోపి, కమిటీ కార్యదర్శి దారా కృష్ణారావు, ఉపాధ్యక్షులు గాదె నరసింహారెడ్డి, పూర్వ విద్యార్థులు గుడ్లూరు రమణ, మందపాటి ప్రభాకరరెడ్డి, బాల నాగేశ్వరరావు, జి. వెంకటరామిరెడ్డి, దొడ్డా  కృష్ణయ్య పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్