నవతెలంగాణ సికింద్రాబాద్: జనవిజ్ఞాన వేదిక ముషీరాబాద్ శాఖ ఆధ్వర్యంలో పాఠశాల స్థాయి చెకుముకి టాలెంట్ టెస్ట్-2026 గురువారం అమరావతి టాలెంట్ స్కూల్, అమరావతి గ్రామర్ హై స్కూల్,సాయి వివేకానంద హైస్కూల్ లలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జనవిజ్ఞాన వేదిక జిల్లా ఉపాధ్యక్షులు ఎస్.కె.స్టాలిన్ పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్.కె.స్టాలిన్ మాట్లాడుతూ....జనవిజ్ఞాన వేదిక ముషీరాబాద్ శాఖ ఆధ్వర్యంలో పాఠశాల స్థాయి చెకుముకి టాలెంట్ టెస్ట్ లో అమరావతి గ్రామర్ హై స్కూల్ ఇంగ్లీష్ మీడియం-190మంది విద్యార్థులు,అమరావతి టాలెంట్ స్కూల్ ఇంగ్లీష్ మీడియం-150మంది విద్యార్థులు,సాయి వివేకానంద హైస్కూల్ -75మంది విద్యార్థులు పాల్గొన్నారని తెలిపారు.జన విజ్ఞాన వేదిక పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులలో సైన్స్ పట్ల ఆసక్తిని పెంపొందించడానికి,శాస్త్రీయ దృక్పథాన్ని కల్పించడానికి,తార్కిక ఆలోచనను,సృజనాత్మకత శక్తిని పెంపొందించడానికి ప్రతి ఏటా చెకుముకి టాలెంట్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో అమరావతి టాలెంట్ స్కూల్ ఇంగ్లీష్ మీడియం ప్రిన్సిపాల్ ప్రశాంత్ రెడ్డి,అకడమిక్ ఇంఛార్జ్ మంగళ మేరీ,అమరావతి గ్రామర్ హై స్కూల్ ప్రిన్సిపాల్ వెంకటేశ్వర రెడ్డి, సాయి వివేకానంద హైస్కూల్ ప్రిన్సిపాల్ ఆర్.డి.శివ్ కుమార్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.






కామెంట్‌లు (0)