- అభినందించిన పాఠశాల డైరెక్టర్ మొండ్రు రత్నాకర్
నవతెలంగాణ-సత్తుపల్లి
సత్తుపల్లి మిరాకిల్ మైండ్స్ పాఠశాల 9వ తరగతి విద్యార్థి పార్థు అథ్లెటిక్స్ పోటీలలో అద్భుత ప్రతిభ కనబరిచి స్వర్ణ పతకాన్ని సాధించాడు. గురువారం ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో జరిగిన జిల్లా స్థాయి అండర్-16 పురుషుల 60 మీటర్ల రన్నింగ్ పోటీలలో విద్యార్థి పార్థు ప్రథమ స్థానంలో నిలిచాడు. ఖమ్మం జిల్లా జూనియర్ అథ్లెటిక్స్ మీట్-2026లో భాగంగా జరిగిన ఈ పోటీలలో పార్థు బంగారు పతకం సాధించి జిల్లా ఛాంపియన్గా నిలిచాడు. ఈ అరుదైన విజయం సాధించడం పట్ల పాఠశాల యాజమాన్యం హర్షం వ్యక్తం చేసింది.
పాఠశాల డైరెక్టర్ అండ్ ప్రిన్సిపాల్ మొండ్రు రత్నాకర్ గోల్డ్ మెడల్ సాధించిన పార్థును అభినందించారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో రాష్ట్ర, జాతీయ స్థాయిలో మరెన్నో పతకాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు. చదువుతో పాటు క్రీడలకు సమాన ప్రాధాన్యత ఇస్తున్నామని రత్నాకర్ తెలిపారు. ఈ విజయం పాఠశాల క్రీడా స్ఫూర్తికి, విద్యార్థుల ప్రతిభకు నిదర్శనమని తెలిపారు. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి మిరాకిల్ మైండ్స్ పాఠశాల నిరంతరం కృషి చేస్తోందని పేర్కొన్నారు. విద్యార్థి కష్టపడే తత్త్వాన్ని, పట్టుదలను పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు బూరుగు మురళి, కళ్యాణి అభినందించారు. తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులు పార్థుకు అభినందనలు తెలిపారు.







కామెంట్లు (0)