Magazines

రైతు మహాసభలను జయప్రదం చేయండి 

08 నవంబర్, 2026

success
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 08, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - మర్రిగూడ : జిల్లా కేంద్రంలో ఈనెల 15 నుండి 18 వరకు జరిగే అఖిలభారత 36వ రైతు మహాసభలను జయప్రదం చేయాలని సిపి ఐఎం మండల కార్యదర్శి ఏర్పుల యాదయ్య పిలుపునిచ్చారు. ఆదివారం మండల కేంద్రంలో మహాసభలకు సంబంధించిన ఫ్లెక్సీని ఏర్పాటు చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. మహాసభలలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై భవిష్యత్ కార్యాచరణ రూపొందించడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా శివన్నగూడ రిజర్వాయర్ ను పూర్తిచేసి మునుగోడు ప్రాంతానికి సాగునీరు అందించాలని,పంటకు గిట్టుబాటు ధర,పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించాలని, ఎల్ నినో ప్రభావంతో ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా రైతుల పంట రుణాలను మాఫీ చేయాలని, రైతులకు 12 గంటల నాణ్యమైన విద్యుత్ అందించాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చేతివృత్తుదారుల సంఘం జిల్లా నాయకులు సల్వోజు రామలింగాచారి, మాధగోని సత్తయ్య, మాధగోని నరసింహ, సల్వోజు రామాచారి, ఆవుల ముత్తయ్య,తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్