Magazines

టిప్పర్ ఢీకొని వివాహిత దుర్మరణం.. భర్త కళ్ల ముందే విషాదం

3 గంటల క్రితం

Married woman dies after being hit by a tipper truck.. Tragedy in front of her husband's eyes
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 11, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - నేరేడుచర్ల: అతివేగంగా వచ్చిన టిప్పర్‌ ద్విచక్రవాహనాన్ని ఢీకొనడంతో ఓ వివాహిత అక్కడికక్కడే మృతి చెందింది. భర్తతో కలిసి బైక్‌పై వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. భర్త కళ్ల ముందే భార్య ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబంలో విషాదం నెలకొంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా నాగులవంచ గ్రామానికి చెందిన బొమ్మిని వెంకన్న, సూరమ్మ (40) దంపతులు చిలక జ్యోతిష్యం చెబుతూ జీవనం సాగిస్తున్నారు. మిర్యాలగూడ నుంచి హుజూర్‌నగర్‌కు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా నేరేడుచర్ల వద్ద వేగంగా వచ్చిన టిప్పర్‌ వారి వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సూరమ్మ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందింది. టిప్పర్‌ డ్రైవర్‌ నిర్లక్ష్యం, అతివేగమే ప్రమాదానికి కారణమని భర్త వెంకన్న పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతురాలికి భర్తతో పాటు ఇద్దరు కుమారులు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నేరేడుచర్ల ఎస్‌ఐ సీహెచ్‌ గోపాల్‌రెడ్డి తెలిపారు. ప్రమాదం అనంతరం టిప్పర్‌ డ్రైవర్‌ పరారీలో ఉన్నట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్