నవతెలంగాణ-మిడ్జిల్
ఇటీవల అనారోగ్యానికి గురై, మండల కేంద్రంలోని తన స్వగృహంలో చికిత్స పొందుతూ విశ్రాంతి తీసుకుంటున్న దిశ దినపత్రిక విలేకరి శ్రీనివాస్‌ను జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి పరామర్శించారు. శుక్రవారం మండల కేంద్రంలోని శ్రీనివాస్ ఇంటికి చేరుకున్న ఎమ్మెల్యే, ఆయన ఆరోగ్య పరిస్థితిని, అందుతున్న వైద్య సేవలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో పాత్రికేయుల పాత్ర ఎంతో కీలకమన్నారు. శ్రీనివాస్ త్వరగా పూర్తి ఆరోగ్యంతో కోలుకుని, తిరిగి తన వృత్తి బాధ్యతల్లో చురుగ్గా పాల్గొనాలని ఆకాంక్షిస్తున్నానని పేర్కొన్నారు. ఆయనకు మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వం తరఫున అండగా ఉంటామనీ, చికిత్సకైన ఖర్చును సీఎంఆర్ఎఫ్ ద్వారా అందించేందుకు కృషి చేస్తామని చెప్పారు.
కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంబడి ప్రెస్ క్లబ్ గౌరవాధ్యక్షులు బాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మహమ్మద్ గౌస్, సర్పంచుల సంఘం మండల అధ్యక్షులు ఎడ్ల శంకర్ ముదిరాజ్, మసిగుండ్లపల్లి, సర్పంచ్ శ్రీశైలం యాదవ్, కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు వెంకట శివప్రసాద్, వాడియాల మాజీ సర్పంచ్ వెంకటేష్ గౌడ్, మండల నాయకులు తదితరులు ఉన్నారు.







కామెంట్‌లు (0)