Magazines

మంత్రి తుమ్మలతో ఎమ్మెల్యే రాగమయి దయానంద్ భేటీ

1 గంట క్రితం

Minister Thummala
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 22, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-సత్తుపల్లి 

భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం గండుగులపల్లి గ్రామంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును ఆయన నివాసంలో సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సత్తుపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులతో పాటు దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలపై మంత్రితో ఎమ్మెల్యే సుదీర్ఘంగా చర్చించారు.


ముఖ్యంగా వేంసూరు మండలం కల్లూరుగూడెం గ్రామంలో నిర్మాణంలో ఉన్న పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ పనుల పురోగతి, సీతారామ ప్రాజెక్టు సాగునీటితో సత్తుపల్లి డివిజన్‌లో సాగవుతున్న పంటల వివరాలను మంత్రికి ఎమ్మెల్యే వివరించారు. అలాగే నియోజకవర్గంలో అమలవుతున్న ప్రభుత్వ సంక్షేమ పథకాల తీరుతెన్నులు, వాటి పురోగతిపై ఇరువురు సమీక్షించుకున్నారు.  ఎమ్మెల్యే ప్రస్తావించిన ప్రధాన సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి తుమ్మల సానుకూలంగా స్పందించి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి ఏఎంసీ చైర్మన్ చల్లగుళ్ల  నరసింహారావు, అశ్వారావుపేట నియోజకవర్గ సీనియర్ నాయకులు, వివిధ శాఖల అధికారులు, తుమ్మల అభిమానులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్